- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. మృతదేహం పై పుస్తెలతాడు మాయం
భువనగిరి జిల్లా ఆస్పత్రిలో చనిపోయిన మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు మాయం అయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

దిశ, యాదాద్రి కలెక్టరేట్: భువనగిరి జిల్లా ఆస్పత్రిలో చనిపోయిన మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడు మాయం అయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం వర్కట్‌పల్లికి చెందిన సుష్మిత అనే గర్భవతి అనారోగ్యంతో బాధపడుతు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జిల్లా ఆసుపత్రికి భర్త నాగరాజు తీసుకుని వచ్చారు.
సుస్మిత ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తెల్లవారుజామున మృతి చెందినది. మృతురాలు మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు కనిపించకుండా పోయిందని బంధువుల ఆరోపించారు. ఆసుపత్రిలో పుస్తెల తాడు మాయం అయిందని మృతురాలు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మృతురాలు బంధువులు జిల్లా కేంద్ర ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.






