50 ఏళ్ల పాత బ్రిడ్జి శిథిలావస్థ.. వాహనదారుల్లో ఆందోళన

by Batti.Sumithra |

మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో గల ధర్మ కాంటా దగ్గర్లో ఉన్న బ్రిడ్జి ప్రమాదపుటంచున ఉన్నది.

50 ఏళ్ల పాత బ్రిడ్జి శిథిలావస్థ.. వాహనదారుల్లో ఆందోళన
X

దిశ, గాంధారి : మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో గల ధర్మ కాంటా దగ్గర్లో ఉన్న బ్రిడ్జి ప్రమాదపుటంచున ఉన్నది. గత రెండు రోజుల నుండి గాంధారిలో కురుస్తున్న వర్షాలకు వంతెన ఒకవైపు కూలిపోయి కుంగిపోయింది. కామారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిలో ఉన్న ఈ చిన్న వంతెన ఓవైపు కూలిపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ఇదే రహదారి వాహనాలతో పాటు, భారీ వాహనాలు సైతం ప్రతిరోజు పెద్దసంఖ్యలో రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ బ్రిడ్జిని దాదాపు 50 సంవత్సరాల క్రింద నిర్మించడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలం ప్రారంభంలోనే ఈ బ్రిడ్జి కృంగిపోవడంతో, సకాలంలో ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ వంతెన ఒకవేళ కూలిపోతే కామారెడ్డి నుండి బాన్సువాడ వైపు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాన్సువాడతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Next Story