- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవిలోకి వెళ్లిన ప్రేమజంటకు చేదు అనుభవం
సరదాగా అడవిలోకి వెళ్లిన ఓ ప్రేమజంటకు చేదు అనుభవం ఎదురైంది.

దిశ, వెబ్ డెస్క్ : సరదాగా అడవిలోకి వెళ్లిన ఓ ప్రేమజంటకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ పని చేస్తున్న కూలీలు వీరిని బెదిరించి డబ్బులు లాక్కోవడమే కాకుండా, సదరు బాలికపై అత్యాచారం చేసిన అమానుష ఘటనమహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన ఒక యువకుడు మరియు 17 ఏళ్ల మైనర్ బాలిక శుక్రవారం నాడు మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని పిల్లిగుండుతండా అటవీ ప్రాంతానికి వచ్చారు. వీరిని గమనించిన అశోక్ కుమార్ (26), లక్ష్మణ్ (27) అనే ఇద్దరు వ్యక్తులు వారిని వెంబడించి, నిర్మానుష్య ప్రదేశంలో పట్టుకున్నారు. నిందితులు మొదట ఆ జంటను తీవ్రంగా బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. యువకుడి వద్ద నగదు లేదని చెప్పినప్పటికీ వినకుండా, అతడిని భయపెట్టి తన స్నేహితుడి ద్వారా రూ. 6,500 ఫోన్‌పే చేయించుకున్నారు.
అంతటితో ఆగకుండా, ఆ కిరాతకులు యువకుడి ముందే ఆ బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు తన ఇంటికి వెళ్ళాక జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. వెంటనే వారు హన్వాడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి, శనివారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.






