బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందా..? ఆ మేక పిల్లను చూసేందుకు క్యూ కట్టిన జనం

by Disha Web Desk |
బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందా..? ఆ మేక పిల్లను చూసేందుకు క్యూ కట్టిన జనం
X

దిశ, ఫీచర్ : వింతలకు పుట్టినిల్లుగా మారింది నేటి ఆధునిక యుగం. అరుదైన జననాలు, సరి కొత్త ఆవిష్కరణలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి.తాజాగా టర్కీలో వెంట్రుకలు లేకుండా ఒక మేక పిల్ల జన్మించి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. దక్షిణ ప్రావిన్స్ మెర్సిన్‌లోని సిరిస్ గ్రామానికి చెందిన హుసేయిన్, ఐసెల్ టోసన్ దంపతులు వ్యవసాయంతోపాటు పశుపోషణలో చేసుకుంటూ జీవిస్తున్నారు. మూగజీవాలపై ప్రేమతో పశువులు, మేకలను మందల కొద్ది పెంచుకుంటున్నారు. కాగా ఇటీవల వీరికి చెందిన ఓ మేక గర్భం దాల్చి కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక మేకపిల్ల సహజంగా జన్మించగా.. మరొకటి వైవిద్యంగా జన్మించింది. ఆ కవల మేకపిల్ల పూర్తిగా వెంట్రుకలు లేకుండా జెట్-నలుపు, ముడతలు పడిన చర్మంతో పుట్టింది. అరుదైన ఈ పిల్లను ఆ దంపతులు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అయితే వింత రూపం ఉన్న ఈ మేక పిల్ల పుట్టిన ఐదు రోజులకు దాని గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో ఈ అద్భుతమైన మేకను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు భారీగా వారి వ్యవసాయ క్షేత్రానికి తరలివస్తున్నారు. అయితే ఆ చిన్న పొలంలో ఆ మేక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఆ మేకపిల్లను చూసిన ప్రజలు మాత్రం బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారమే ఇలాంటి వింత జీవులు జన్మిస్తున్నాయని పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed