వంట పేరుతో పిలిచి బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చినా వదలకుండా రోజూ అలాగే..

by Disha Web Desk 19 |
వంట పేరుతో పిలిచి బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చినా వదలకుండా రోజూ అలాగే..
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో రగిలిపోతున్న కొందరు పసి పిల్లల నుండి పండు ముసలి వరకు ఎవరినా వదలకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన బీహార్‌లో జరిగింది. 60ఏళ్ల వృద్దుడు ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక గర్భం దాల్చిన వదలకుండా భయపెట్టి మళ్లీ దారుణానికి పాల్పడ్డాడు.

వివరాల ప్రకారం.. బీహార్‌లోని చంపారన్ గ్రామంలో ముఖలాల్(60) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అయితే పక్కింట్లో ఉండే మైనర్ బాలిక కన్నేసి.. వంట చేసేందుకు రావాలనే సాకుతో ఆ బాలికను పిలిచేవాడు. 60ఏళ్ల వ్యక్తి కావడంతో సహయం చేసేందుకు వెళ్తే.. బాలిక కుటుంబ సభ్యులు కూడా పట్టించుకునే వారు కాదు. ఇదే అదనుగా భావించిన ముఖలాల్ బాలికను మభ్యపెట్టి.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో.. బయట తెలిస్తే పరువు పోతుందని.. రహస్యంగా బాలికకు అబార్షన్ చేయించారు.

ఇంత జరిగినా మారని ముఖలాల్ బాలికను భయపెట్టి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా నేను ఎప్పుడే పిలిస్తే.. అప్పుడు రావాలని.. లేదంటే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం అందరికి తెలుస్తుందని భయపడ్డ నిందితుడు.. పెద్దమనుషులు సమక్షంలో పంచాయతీ పెట్టి 2లక్షలకు ఇస్తానని ఒప్పుకున్నాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు కేసు విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో సీరియస్‌గా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయని వారిపై చర్యలు తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారు ఫిర్యాదు చేస్తే నిందితునిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.



Next Story

Most Viewed