ఆచంటలో అమానుషం.. ఆరేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం!

by Malleboina Mahesh |

ప.గో. జిల్లా ఆచంటలో అమానుషం! ఆరేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆచంటలో అమానుషం.. ఆరేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో అత్యంత హేయమైన ఘటన వెలుగుచూసింది. మనవరాలు వయసున్న ఆరేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు కామవాంఛతో విరుచుకుపడ్డాడు. ఆచంట గ్రామానికి చెందిన ఒక ఆరేళ్ల బాలిక వస్తువులు కొనుగోలు చేసేందుకు స్థానికంగా ఉన్న ఒక దుకాణానికి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన 60 ఏళ్ల దుకాణదారుడు, ఆ చిన్నారిని లోపలికి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని మెరుగైన వైద్యం, వైద్య పరీక్షల నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story