దేశవ్యాప్తంగా 83 CAPF శిక్షణా సంస్థలు.. ఐదేళ్లలో రూ. 755 కోట్ల కేటాయింపు

by Malleboina Mahesh |

భారత దేశానికి వివిధ దేశాలతో ఉన్న దేశ సరిహద్దులను రక్షించడంలో, అంతర్గత భద్రతను కాపాడటంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా 83 CAPF శిక్షణా సంస్థలు.. ఐదేళ్లలో రూ. 755 కోట్ల కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశానికి వివిధ దేశాలతో ఉన్న దేశ సరిహద్దులను రక్షించడంలో, అంతర్గత భద్రతను కాపాడటంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో CAPF సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ (Union Minister of State for Home Affairs Nityanand Rai) ఈ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా CAPF అవసరాల కోసం మొత్తం 83 శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

అత్యంత ఆధునిక సాంకేతికతతో శిక్షణ

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా ఆధునిక సాంకేతికతతో శిక్షణ ఇస్తున్నారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో జవాన్లకు శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. శిక్షణా కేంద్రాల విస్తరణ, ఆధునీకరణ, అప్‌గ్రేడేషన్ నిరంతరంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరికరాలు, మోటారు వాహనాల కొనుగోలు తో పాటు శిక్షణ నిపుణుల నియామకానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.

విజయవంతమైన ఆపరేషన్లే నిదర్శనం

గత కొంతకాలంగా CAPF సంస్థలు అందిస్తున్న సమర్థవంతమైన శిక్షణ వల్లే దేశంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలు, సరిహద్దు భద్రత, తిరుగుబాటు అణచివేత, వామపక్ష తీవ్రవాద (LWE) నిర్మూలనలో జవాన్లు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని నిత్యానంద రాయ్ కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో CAPF శిక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 755.42 కోట్లు కేటాయించగా, అందులో రూ. 743.46 కోట్లు సమర్థవంతంగా వినియోగించబడ్డాయని మంత్రి గణాంకాలతో వివరించారు. కేటాయించిన నిధులను దాదాపు పూర్తిగా (98% పైగా) వినియోగించడం ద్వారా శిక్షణా కేంద్రాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత స్పష్టమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story