77వ గణతంత్ర వేడుకలు.. 'వికసిత భారత్' లక్ష్యంగా సాగాలని ప్రధాని మోడీ పిలుపు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-26 04:01:06  IST  )

భారతదేశ పౌరులకు ప్రధాని మోడీ 77వ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం మిన్నంటాయి.

77వ గణతంత్ర వేడుకలు.. వికసిత భారత్ లక్ష్యంగా సాగాలని ప్రధాని మోడీ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ పౌరులకు ప్రధాని మోడీ 77వ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం మిన్నంటాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ (PM Modi) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. 'ఎక్స్‌' (X) వేదికగా ప్రజలకు కీలక పిలుపు నిచ్చారు. ఆయన తన ట్వీట్‌లో "ఈ ఉత్సవం మనందరిలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను. మనమంతా కలిసికట్టుగా 'వికసిత భారత్' నిర్మించాలనే సంకల్పాన్ని మరింత బలోపేతం చేద్దాం" అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఉదయం జాతీయ యుద్ధ స్మారక చిహ్నం (National War Memorial) వద్ద అమరవీరులకు నివాళులర్పించి వేడుకలను ప్రారంభించారు.

ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన పరేడ్‌లో భారత్ తన అజేయమైన సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ఏడాది వేడుకల్లో 'వందేమాతరం' 150 ఏళ్ల ఉత్సవం ప్రధాన ఇతివృత్తంగా (Theme) నిలిచింది. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్'లో వినియోగించిన అత్యాధునిక ఆయుధ సంపత్తిని, కొత్తగా ఏర్పాటైన సైనిక విభాగాలను పరేడ్‌లో ప్రదర్శించారు. బ్రహ్మోస్, ఆకాష్ క్షిపణి వ్యవస్థలతో పాటు దేశీయ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Next Story