- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూయార్క్ లో కాల్పుల.. 7 నెలల పసికందు మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన గ్యాంగ్ వార్ కాల్పుల్లో 7 నెలల పసికందు మృతి చెందింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. గత బుధవారం మధ్యాహ్నం బ్రూక్లిన్‌లోని ఈస్ట్ విలియమ్స్‌బర్గ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఏడు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని బ్రూక్లిన్‌లోని ఈస్ట్ విలియమ్స్‌బర్గ్ రోడ్డులో చిన్నారి తల్లి తన రెండేళ్ల కుమారునితో నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే సమయంలో స్కూటర్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రత్యర్థి గ్యాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో దూసుకొచ్చిన ఒక 'స్ట్రే బులెట్' నేరుగా చిన్నారి కౌరి తలకు తగలడంతో ఆ పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనలో చిన్నారి సోదరుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిలో ఒకరిని 21 ఏళ్ల అమరి గ్రీన్ గా పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కూటర్ నడిపిన మరో నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పట్టపగలు వీధుల్లో ఇలాంటి హింస చోటుచేసుకోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కళ్లముందే పసిబిడ్డ ప్రాణాలు పోవడంతో తల్లి షాక్ లోకి వెళ్లిందని సమాచారం.






