అమెజాన్ మ్యూజిక్ ఫెస్ట్ సేల్.. ఆడియో గాడ్జెట్‌లపై 60% తగ్గింపు

by Disha Web |
అమెజాన్ మ్యూజిక్ ఫెస్ట్ సేల్.. ఆడియో గాడ్జెట్‌లపై 60% తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్తగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్‌ను తెచ్చింది. వినియోగదారులు స్పీకర్లు, హెడ్‌ఫోన్‌లు, ఇతర ఆడియో గాడ్జెట్‌లపై 60% తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ మార్చి 27 నుంచి ప్రారంభమై 29 వరకు ఉంటుంది. 'మెగా మ్యూజిక్ ఫెస్ట్' సేల్‌లో, కస్టమర్లు బ్లూపంక్ట్, బోఆట్, సోనీ, జెబిఎల్, నాయిస్ వంటి బ్రాండ్‌ల నుండి ఆడియో ఉత్పత్తులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అమెజాన్ 10% అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది.

సోనీ WH-1000XM4

Sony WH-1000XM4, వైర్‌లెస్ నాయిస్ క్యాన్సిలేషన్ బ్లూటూత్ హెడ్‌ఫోన్, 17% తగ్గింపుతో రూ. 24,990కి అందుబాటులో ఉంది. ఫోన్ కాల్‌ల కోసం అత్యాధునిక మైక్‌ ఉంది. ఇది 30 గంటల పాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

JBL ఫ్లిప్ 6

JBL ఫ్లిప్ 6 వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్లు రూ. 11,999కి విక్రయిస్తున్నారు. స్పీకర్లు 12 గంటల ప్లేటైమ్, IP67 వాటర్, డస్ట్‌ప్రూఫ్ ఫీచర్‌లతో వస్తాయి.

బోట్ ఎయిర్‌డోప్స్ 441

Amazon boAt Airdopes 441ని సేల్ సమయంలో రూ. 1,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. దాని రిటైల్ ధర రూ. 5,999. బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు ఒక్కో చార్జీకి గరిష్టంగా 5 గంటల వరకు ప్లే టైమ్‌ని అందిస్తాయి. వాటర్, చెమట ప్రూఫ్ కోసం IPX7 రేటింగ్‌ ఉంది.

బోట్ ఎయిర్‌డోప్స్ 141

boAt Airdopes 141 రిటైల్ ధర రూ. 4,490. కాని అమెజాన్ ఫెస్ట్‌లో దీని ధర రూ. 1,329. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు 42 గంటల ప్లేటైమ్ అందిస్తాయి. ఇయర్‌బడ్‌లు IPX4 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తాయి.


Next Story