నిజామాబాద్‌లో 5.1 కిలోల గంజాయి పట్టివేత

by Batti.Sumithra |

గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.

నిజామాబాద్‌లో 5.1 కిలోల గంజాయి పట్టివేత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుండి 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే తనిఖీల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో నిజామాబాద్ బృందం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల సందర్భంగా సంబల్పూర్ నుంచి నాందేడ్‌కు వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన అఖిల్ ఆలం, మహమ్మద్ చాంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 5.1 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఏ. గంగాధర్, మల్లేష్, ట్రైనీ ఏఈఎస్ గాయత్రి, కానిస్టేబుళ్లు దేవేందర్, శైలేష్, గౌతమ్ పాల్గొన్నారు.

Next Story