400ల మంది డ్యాన్సర్లతో #RC15 సాంగ్

by Disha Web Desk 2 |
400ల మంది డ్యాన్సర్లతో #RC15 సాంగ్
X

దిశ, సినిమా : శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం #RC15. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఓ సాంగ్ చిత్రీకరణకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాలేజ్ బ్యాడ్ డ్రాప్‌లో షూట్ చేయనున్న ఈ పాటలో దాదాపు 400 మంది డ్యాన్సర్లు కనిపించనున్నారు. ఇక పాటలను గ్రాండియర్‌గా చిత్రీకరించడంలో శంకర్‌ది అందె వేసిన చేయి కాబట్టి ఈ పాట కూడా అదే రేంజ్‌లో ఉంటుందని సమాచారం. కాగా ఈ ప్రత్యేక గీతానికి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తుండటం విశేషం.

Next Story

Most Viewed