వరుసగా ఢీకొన్న 60 వాహనాలు.. వీడియో

by S Gopi |   (  Updated:2022-03-29 08:16:25  IST  )

దిశ, వెబ్ డెస్క్: మంచు కారణంగా భారీ వాహనాలతోపాటు..3 dead after snow squall causes mass pileup on Pennsylvania highway in America

వరుసగా ఢీకొన్న 60 వాహనాలు.. వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: మంచు కారణంగా భారీ వాహనాలతోపాటు పలు కార్లు ఢీకొన్న సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై మంచు కురుస్తున్న కారణంగా భారీ వాహనాలు ఢీకొన్నాయి. అదేవిధంగా పలు కార్లు కూడా ఢీకొన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారని.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అందులో పేర్కొన్నారు. ట్రక్కులు, ట్రాక్టర్లు మరియు కార్లతో సహా హైవేపై ఢీకొన్న వాహనాల సంఖ్య 50 నుంచి 60 మధ్య ఉన్నట్లు తెలిసింది.


Next Story