మున్సిపల్ కమిషనర్ సస్పెండ్‌పై హర్షం..

by Kodari Anjali |   (  Updated:2026-06-06 06:44:30  IST  )

సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడటంతో ఓ వ్యక్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట టపాసులు కాల్చారు.

మున్సిపల్ కమిషనర్ సస్పెండ్‌పై హర్షం..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడటంతో ఓ వ్యక్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట టపాసులు కాల్చారు. టపాసులు కాల్చిన వ్యక్తి బుస్స కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం... 17 వార్డు వివేకనంద కాలనీలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి అనుమతి వచ్చిందన్నారు. నిర్మాణ పనులు చేపట్టిన అనంతరం సస్పెండ్ అయిన మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ కింది స్థాయి అధికారుల ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు. తర్వాత ఇందిరమ్మ ఇళ్లు క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు. అవినీతి అధికారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మున్సిపల్ కార్యాలయంలో ఎదుట బాధితుడు టపాసులు కాల్చడంపై పట్టణంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది.

Next Story