సల్మాన్ ఖాన్-నయనతార సినిమా విషయంలో వంశీ పైడిపల్లి ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాకే!

by Mallepaka Hamsa |

కీలకమైన షూటింగ్ షెడ్యూల్ జూన్ 10 నుండి ముంబై నగరంలో ప్రారంభం కాబోతోందని టాక్.

సల్మాన్ ఖాన్-నయనతార సినిమా విషయంలో వంశీ పైడిపల్లి ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాకే!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా కనిపించనుంది.దిల్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరగడంతో పాటుగా.. షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా,క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. కీలకమైన షూటింగ్ షెడ్యూల్ జూన్ 10 నుండి ముంబై నగరంలో ప్రారంభం కాబోతోందని టాక్. ఈ షెడ్యూల్‌లో సినిమాకు అత్యంత కీలకమైన భారీ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించడానికి దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లాన్ చేశారట. ముంబై నగరంలోని వాస్తవిక లొకేషన్లలో ఈ యాక్షన్ సీన్లను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ యాక్షన్ సన్నివేశాలకు ఒక మెట్రోపాలిటన్ నగరం, వాతావరణం, వైవిధ్యం చాలా అవసరం. అందుకే బాంద్రా దాని పరిసర ప్రాంతాలలోని పబ్లిక్ లొకేషన్లలో ఈ షూటింగ్ జరగనున్నట్లు టాక్. సల్మాన్ ఖాన్, నయనతార ఇద్దరిపై ఇక్కడ కార్ ఛేజింగ్‌లు, వాహనాలతో కూడిన స్టంట్లు, కోట్లాట, భారీ జనం మధ్య సాగే యాక్షన్ సీన్లను షూట్ చేయబోతున్నారట. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత, దర్శకుడు కలిసి సల్మాన్ ఖాన్ కోసం ఒక ప్రత్యేకమైన యాక్షన్ సెట్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓ సీన్ సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలిచేలా ఉంటుందట. ఈ సీన్ మొదట ఒకరిని తరుముకుంటూ వెళ్లే ఛేజింగ్ సీన్‌లా ప్రారంభమై, ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య జరిగే ఒక పెద్ద ఘర్షణగా మారుతుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది తెలుసుకున్న వారంతా వంశీ పైడిపల్లి ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు.

Next Story