ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: 25శాతం ప్రేక్షకులతో ఫస్ట్ ఫేజ్

by Web Desk |
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: 25శాతం ప్రేక్షకులతో ఫస్ట్ ఫేజ్
X

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు మహారాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే మ్యాచులకు 25 శాతం మంది ప్రేక్షకులతో టోర్నీ నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం స్పోర్ట్స్ అండ్ టూరిజం మినిస్టర్ ఆదిత్య థాకరే మరో మంత్రి ఏక్‌నాథ్ షిండేతో కలిసి బీసీసీఐ అధికారులు, బృహన్ ముంబై కార్పొరేటర్లు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ విషయాన్ని మంత్రి ఆదిత్య థాకరే ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ముంబైలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయని, ఈ క్రమంలోనే మార్చి 26 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే ఐపీఎల్ తొలి దశలో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్టు వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా రెండో దశలో మరింత మందికి అనుమతించనున్నట్టు సమావేశంలో నిర్ణయించారు. ఐపీఎల్ 15వ సీజన్‌ ముంబై వేదికగా వాంఖడే, డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్నాయి. ఒక్కో మైదానంలో 20 మ్యాచులు చొప్పున బ్రబోన్ స్టేడియంలో 15 మ్యాచులు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ లీగ్‌లో మొత్తంగా 50శాతం ఆక్యూపెన్సీతో ఐపీఎల్ మ్యాచులను నిర్వహించనున్నట్టు సమాచారం.



Next Story

Most Viewed