22 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

by Ratna Kumari |

వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 22 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

22 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
X

దిశ, సత్తుపల్లి : వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 22 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, 10 మోటార్‌సైకిళ్లు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వేంసూరు ఎస్సై కవిత తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం అమ్మపాలెం గ్రామ శివారులో పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసు బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో షేక్ మొహిద్దిన్, చింత వెంకటేశ్వరరావు, షేక్ యాకూబ్ పాషా, పూరేటి శ్రీనివాసరావు, మరో పూరేటి శ్రీనివాసరావు (సాఫ్ట్‌వేర్ ఉద్యోగి)తో పాటు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా పేకాటలో పాల్గొన్న మరో 17 మంది వ్యక్తులను కూడా కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారిలో మహ్మద్ ఇమ్రాన్, కంచర్ల వెంకటేశ్వరరావు, జయం శ్రీహరి, ఏసు రాంబాబు, యర్రా శ్రీను, తడికమళ్ల వీరయ్య, వేము మురళి, మహేష్, సలీం, అర్జున్ రావు, చేగూరి చెన్నారావు, నజీర్, ఫయాజ్, మందుల కృష్ణ, కృష్ణ, చిల్లపల్లి వెంకట సత్యనారాయణ, పులగం రెడ్డి ఉన్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో పేకాట, కోడిపందాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story