2027 జనాభా లెక్కలు.. ఇళ్ల జాబితా సేకరణకు షెడ్యూల్ విడుదల

by Malleboina Mahesh |

దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు నిర్వహించేందుకు గత పార్లమెంట్ లో కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

2027 జనాభా లెక్కలు.. ఇళ్ల జాబితా సేకరణకు షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు నిర్వహించేందుకు గత పార్లమెంట్‌లో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 2027 జనాభా లెక్కలకు (Census of India 2027) సంబంధించి కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఇళ్ల జాబితా సేకరణ (Houselisting Operations) ప్రక్రియను 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 తేదీల మధ్య చేపట్టనున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ఆరు నెలల కాలపరిమితిలో తమకు అనుకూలమైన ఏదైనా 30 రోజుల పాటు ఈ గణనను నిర్వహించుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఈసారి జనాభా లెక్కల్లో ప్రజలకు 'సెల్ఫ్ ఎన్యూమరేషన్' (Self-enumeration), స్వయంగా వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించారు. అధికారులు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరించే 30 రోజుల ప్రక్రియ ప్రారంభమవడానికి సరిగ్గా 15 రోజుల ముందే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ప్రజలు ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను ముందే నమోదు చేసుకునేలా ఈ మార్పులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Next Story