ప్రభాస్ నామ సంవత్సరంగా ఆ ఇయర్..?

by Dishafeatures2 |
ప్రభాస్ నామ సంవత్సరంగా ఆ ఇయర్..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస పాన్ ఇండియా సినిమాలతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు 5 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. వాటిలో 'రాధేశ్యామ్' రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో చేస్తున్న 'ఆదిపురుష్' ఇటీవల రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. వచ్చే ఏడాది 2023 సంక్రాంతి బరిలో ఆదిపురుష్ నిలువనున్నట్లు వారు తెలిపారు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ దీంతో కాస్త నిరాశ పడినా.. 2023లో ఉన్న ప్రభాస్ మూవీస్ లైనప్‌తో ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రభాస్‌దే అని.. 2023 ప్రభాస్ నామ సంవత్సరం అంటూ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నారు. మరి వచ్చే ఏడాదిని కేవలం సినిమాల రిలీజ్‌తోనే కాకుండా వరుస హిట్‌లతో నిజంగా ప్రభాస్ నామ సంవత్సరంగా మారుస్తాడేమో చూడాలి.



Next Story

Most Viewed