- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల ప్రయోజనాల కోసమే 2021 పే స్కేల్ అమలు: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
ఆర్టీసీ ఉద్యోగులకు 2021 పే స్కేల్ అమలు! ప్రభుత్వంలో విలీనం మరియు కార్మిక సంఘాల ఎన్నికలపై ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన.

దిశ, తెలంగాణ బ్యూరో: కార్మికుల చిరకాల కోరికైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని... దీనికి సంబంధించిన విధివిధానాలు, ఇతర సాంకేతిక అంశాలపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తుందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి (RTC MD Nagi Reddy) తెలిపారు. అలాగే ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, 2021 పే స్కేల్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో వేతన సవరణ ఉందని నాగిరెడ్డి వెల్లడించారు.
ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని... ప్రజాస్వామ్యబద్ధంగా కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను నిర్వహించేందుకు త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. సమ్మె కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి సంస్థ చింతిస్తోందని... శనివారం తెల్లవారుజాము నుంచి అన్ని డిపోల పరిధిలో వంద శాతం బస్సులన్నీ యథావిధిగా అందుబాటులో వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సంస్థను లాభాల బాటలో నడిపించడంలో కార్మికులు తమ వంతు సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామన్నారు.






