- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gujarat Congress: కాంగ్రెస్‌కు షాక్.. ఇద్దరు సీనియర్ నాయకులు రాజీనామా..
2 Congress Leaders in Gujarat are Set to Join BJP| గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరేష్ రావల్, రాజు పర్మార్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

దిశ, వెబ్‌డెస్క్: 2 Congress Leaders in Gujarat are Set to Join BJP| గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరేష్ రావల్, రాజు పర్మార్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆగస్ట్ 17న బీజేపీలో చేరుతున్నామని తెలిపారు. తమ మద్దతుదారులు కూడా అదే రోజు బీజేపీ కండువా కప్పుకుంటారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో గత పదేళ్లలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురైయ్యాయని అన్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. అందుకే కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఇప్పటి నుండే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. మరి కొన్ని నెలల్లో ఎన్నికల జరగనున్న సమయంలో పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు పార్టీని వీడటం కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. దాసోజు శ్రవణ్ రాజీనామా!
- Tags
- Gujarat Congress






