- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1984 అల్లర్ల కేసు.. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ విడుదలపై బాధితుల ఆవేదన
1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీలోని జనక్‌పురి, వికాస్‌పురి ప్రాంతాల్లో హింసను ప్రేరేపించారని కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (Former MP Sajjan Kumar) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పుపై అల్లర్ల బాధితులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరుగుతుందని దశాబ్దాలుగా వేచి చూస్తున్న తమకు ఈ తీర్పు కోలుకోలేని దెబ్బ అని వారు వాపోతున్నారు.
"మాకు న్యాయం జరుగుతుందని ఆశించాం.. గత 42 ఏళ్లుగా ఈ కేసు కోసం పోరాడుతున్నాం. నా కళ్ల ముందే నా తండ్రిని సజీవ దహనం చేశారు. ఆనాడు సిక్కులు చేసిన తప్పేంటి? ఇన్ని ఏళ్లు గడిచినా ప్రభుత్వం మాకు ఎందుకు న్యాయం చేయడం లేదు?" అంటూ ఒక బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. నిందితులకు తగిన శిక్ష పడుతుందని ఆశించిన కుటుంబాలకు ఈ నిర్దోషిత్వ తీర్పు తీవ్ర అన్యాయమని, చట్టం పై నమ్మకం సడలిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.






