విడతల వారీగా 1,500 ఆపరేషన్లు పూర్తి

by Ratna Kumari |

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నాలుగో విడత మెగా సర్జికల్ క్యాంపు మూడో రోజుకు చేరుకుని విజయవంతంగా కొనసాగుతోంది.

విడతల వారీగా 1,500 ఆపరేషన్లు పూర్తి
X

దిశ, అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నాలుగో విడత మెగా సర్జికల్ క్యాంపు మూడో రోజుకు చేరుకుని విజయవంతంగా కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మెగా క్యాంపుకు విశేష స్పందన లభిస్తోంది. గత నాలుగు విడతలుగా నిర్వహిస్తున్న సర్జికల్ క్యాంపుల ద్వారా ఇప్పటివరకు మొత్తం 1,500 శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 180 ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. వైద్య వృత్తిని ప్రజాసేవతో మేళవిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్వయంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మంగళవారం ఆయన క్యాంపును పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు.

ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ సర్జికల్ క్యాంపును నిర్వహిస్తున్నామని తెలిపారు. శస్త్రచికిత్సల కోసం నమోదు చేసుకున్న రోగులకు నిపుణులైన వైద్యుల బృందం విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహిస్తోందని చెప్పారు. రోగులకు అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు, మందులు, శస్త్రచికిత్స అనంతర చికిత్సలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంకా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకుని శస్త్రచికిత్సలు చేయించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మెగా సర్జికల్ క్యాంపు విజయవంతం కావడంలో సహకరిస్తున్న స్థానిక వైద్యులు, సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

Next Story