- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: భూ భారతి కుంభకోణం కేసులో 15 మంది అరెస్ట్
భూ భారతి కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భూ భారతి కుంభకోణం కేసు(Bhu Bharati Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనగామ, యాదాద్రి జిల్లాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. బసవరాజు, జెల్లాను ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి వీరు గండికొట్టినట్లు చెప్పారు. భూ భారతి వెబ్‌సైట్ సాంకేతిక లోపాలను ఆధారంగా చేసుకుని అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుల నుంచి ఇప్పటివరకు రూ.63.19 లక్షల నగుదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు నిందితుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. దాదాపు రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలకు కూడా స్వాధీనం చేసుకున్నారు. కార్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 9 మంది నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అతి త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు తెలిపారు.






