తిరుపతిలో 13 నెలల చిన్నారి కిడ్నాప్

by Muthe.Rajitha |

ఏపీలోని తిరుపతి పట్టణంలో 13 నెలల చిన్నారి జయశ్రీ కిడ్నాప్ కు గురైంది.

తిరుపతిలో 13 నెలల చిన్నారి కిడ్నాప్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని తిరుపతి పట్టణంలో 13 నెలల చిన్నారి జయశ్రీ కిడ్నాప్ కు గురైంది. తిరుపతి పోలీసుల ప్రకారం.. చింతలచేను రోడ్డులో మునిరెడ్డి అనే వ్యక్తి చిత్తుపేపర్లు, ప్లాస్టిక్ నీళ్ల సీసాలు సేకరించే దుకాణం నడుపుతున్నాడు. ప్లాస్టిక్ సామాను తెచ్చేవారికోసం అక్కడే గదులు కూడా ఉన్నాయి. మూడు నెలల క్రితం శ్రీకాళహస్తికి చెందిన సుచిత్ర మస్తాన్ దంపతులు తమ చిన్నారి జయశ్రీతో అక్కడికి వచ్చారు. వారి పక్క గదిలో తమిళనాడుకు చెందిన మురుగన్–మారెమ్మ దంపతులు ఉండేవారు. వారు చిన్నారితో ప్రేమగా ఉంటూ, బయటకు తీసుకెళ్లడం చేస్తుండేవారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు మురుగన్ దంపతులుతమ బైక్ పై చిన్నారిని తీసుకెళ్లి తిరిగి రాలేదు.

దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి. మారెమ్మకు గత భర్తల పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ప్రస్తుతం నాలుగో భర్త మురుగన్‌తో జీవిస్తున్నట్లు తెలిసింది. తమిళనాడులోని వేలూరు, కాంచీపురంలో వారి బంధువులు ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక పోలీసు బృందం.. అక్కడికి వెళ్లి విచారిస్తున్నారు.

Next Story