- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు
భూ వివాదంలో ఇద్దరు సోదరులను చంపిన కేసులో, ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి సహరాన్‌పూర్ కోర్టు జీవిత ఖైదు, రూ. 10.73 లక్షల జరిమానా విధించింది.

దిశ, వెబ్ డెస్క్: హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి కోర్టు జీవిత ఖైదు (life imprisonment) విధించింది. ఈ షాకింగ్ నిర్ణయం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా తీసుకుంది. దాదాపు పదేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో నిందితులపై ఉన్న అభియోగాలు నిరూపితం కావడంతో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి వికాస్ గుప్తా ఈ శిక్షను ఖరారు చేశారు. వివరాల్లోకి వెళితే.. 2016లో 20 బిగాల భూమి విషయంలో వివాదం ఏర్పడింది. దీంతో 2016 నవంబర్ 12న జరిగిన ఘర్షణలో యాసిన్, తాసిన్ అనే ఇద్దరు సోదరులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణంపై బాధితుల్లో ఒకరైన యాసిన్ కుమారుడు ఇస్రార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సామూహిక హత్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.
అనంతరం పోలీసులు విచారణ, కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత.. 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శిక్ష పడిన 13 మంది దోషులలో ప్రధానంగా నలుగురు సోదరులు (మునావర్, ముస్తఫా, సనావర్, స్తాకీమ్) వారి కుమారులు ఉన్నారు. దోషులందరికీ జీవిత ఖైదు తో పాటు మొత్తం కలిపి రూ. 10.73 లక్షల భారీ జరిమానాను కూడా కోర్టు విధించింది. జరిమానా సొమ్ము చెల్లించని యెడల అదనపు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పాత కక్షలు, భూ తగాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మంది జైలు పాలు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.






