విద్యార్థులకు అలర్ట్ : 10th సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల

by Muthe.Rajitha |

విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీ పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.

విద్యార్థులకు అలర్ట్ : 10th సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీ పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మే 25 నుండి జూన్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను ఆయా పాఠశాలల లాగిన్‌ల ద్వారా ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు నేరుగా కూడా తమ హాల్‌టికెట్లను పొందేలా ఏర్పాట్లు చేశారు. 'మనమిత్ర' అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా గానీ, లేదా ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ విద్యార్థులు తమ హాల్‌టికెట్లను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం విద్యార్థులు తమ మార్చి 2026 నాటి టెన్త్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Next Story