- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
by Jakkula.Mamatha |
తుర్కపల్లి మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గురువారం తుర్కపల్లి ఎస్ఐ తక్యూద్దీన్ పట్టుకున్నారు.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: తుర్కపల్లి మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గురువారం తుర్కపల్లి ఎస్ఐ తక్యూద్దీన్ పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన తుర్కపల్లి పోలీసులు డీసీఎం వాహనంలో తరలిస్తున్న బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆలేరు పరిసర ప్రాంతాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. వాహనాన్ని తనిఖీ చేసి అందులో సుమారు 100 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేతవత్ ప్రభాస్, బానోత్ శివ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Next Story






