- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్సైజ్ ఉద్యోగులకు 10 శాతం రుణ వడ్డీ
ఎక్సైజ్ శాఖలో పని చేసే ఉద్యోగులకు ఎంతో ఉపయోగ పడుతున్న ఆరోగ్య సహయతను అందరు కలిసి కట్టుగా ముందుకు నడిపించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎక్సైజ్ శాఖలో పని చేసే ఉద్యోగులకు ఎంతో ఉపయోగ పడుతున్న ఆరోగ్య సహయతను అందరు కలిసి కట్టుగా ముందుకు నడిపించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ సూచించారు. అబ్కారీ భవన్‌లోని ఆరోగ్య సాహిత జనరల్‌బాడీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఎక్సయిజ్ శాఖలో 75 శాతం ఉద్యోగులుగా ఉన్న కానిస్టేబుల్ నుంచి ఎస్సైల వరకు ఆరోగ్య సహయతలో సభ్యులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గతంలో ఆరోగ్య సహయత నుంచి పోందే రుణం 12 శాతం నుంచి 10 శాతంకు తగ్గించారని కమిషనర్ తెలిపారు. ఉద్యోగుల్లో అత్యవసర చికిత్సల కోసం డబ్బు అందించడం, రుణం అవసరమున్న ఉద్యోగుల రుణ సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ఎక్సైజ్ శాఖలో కొనసాగుతున్న ఆరోగ్య సహయత ఎంతో మేలు చేస్తుందని కమిషనర్ అభిప్రాయ వ్యక్తం చేశారు.
ఉద్యోగులు ఎవ్వరైన చనిపోతే వారికి రూ. లక్ష ఎక్స్‌గ్రేసియా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సహయతకు జాయింట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) కార్యదర్శిగా వ్యహరించాలని తీర్మానించారు. రిటైడ్, చినపోయిన సభ్యుల స్థానాల్లో కొత్తవారిని నియమించడం, టీజీబీసీఎల్ నుంచి కూడ ఆరోగ్య సహయతలో స్థానం కల్పించాలని కమిషనర్ సమక్షంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఖురేషి, మెదక్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ డిప్యూటి కమిషనర్లు జె.హరికిషన్, పి. దశరథ్, అంజన్‌రావు, శ్రీనివాసరెడ్డిలతోపాటు అసిస్టెంట్ కమిషనర్ చెంద్రయ్య పాల్గొన్నారు.






