- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హత్యకేసులో మధ్యప్రదేశ్ స్థానిక కోర్టు సంచలన తీర్పు
భోపాల్: హత్య కేసులో మధ్యప్రదేశ్ - 10 Members Of Family Jailed For Life For Murder In Madhya Pradesh

X
భోపాల్: హత్య కేసులో మధ్యప్రదేశ్ మోరెనా జిల్లాలోని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరిపై రూ.4 వేల జరిమానా విధించింది. 12 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి దారుణ హత్యకేసులో కోర్టు విచారణ చేపట్టింది. చాలా కాలంగా ఉన్న పాత కక్షలతో బాధితుడు శివకుమార్‌పై నిందితులు దాడికి ప్రణాళిక వేశారు. అతను షాప్ నుంచి తిరిగివస్తుండగా పలు ఆయుధాలతో చుట్టుముట్టి హతమార్చారు. ఈ ఘటనపై కుటుంబాన్ని బాధ్యులుగా చేస్తూ కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన కోర్టు కుటుంబంలోని 10 మందికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు సంచలన తీర్పు నిచ్చింది.
Next Story






