- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీకే విజయ్‌కి టచ్‌లోకి 10 మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు మొదలయ్యాయి. 108 సీట్లు గెలిచిన విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు 10 మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు వార్తలు వస్తుండటంతో రాజకీయాలు వేడెక్కాయి.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా టీవీకే పార్టీ (TVK party) 108 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అలాగే అధికారం చేపట్టే దిశగా ఆడుగులు ముందుకేసింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పు చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 కి కేవలం 10 అడుగుల దూరంలో విజయ్ ఆగిపోవడంతో ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో ఏఐడీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టీవీకే అధినేత విజయ్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఏఐడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డారు. గెలిచిన ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తూ రేపు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు, అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ ఇప్పటికే గవర్నర్ అపాయిట్మెంట్ కోరుతూ లేఖ రాశారు. అటు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయగా, విజయ్ తన మేజిక్ ఫిగర్‌ను ఎలా చేరుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.






