ISIS: ఆ ఉగ్రదాడికి మేమే కారణం

by S Gopi |   (  Updated:2022-07-13 11:20:50  IST  )

ISIS Releases Footage Of Terror Attack In Srinagar| శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడికి మేమే కారణమని ఇస్లామిక్ స్టేట్స్ హింద్ ప్రావిన్స్ (విలాయత్ అల్ హింద్) బుధవారం వెల్లడించింది. మంగళవారం శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్ఐ) ముస్తాక్ అహ్మద్

ISIS Releases Footage  Of Terror Attack In Srinagar
X

జమ్ము: ISIS Releases Footage Of Terror Attack In Srinagar| శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడికి మేమే కారణమని ఇస్లామిక్ స్టేట్స్ హింద్ ప్రావిన్స్ (విలాయత్ అల్ హింద్) బుధవారం వెల్లడించింది. మంగళవారం శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్ఐ) ముస్తాక్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఫయాజ్ అహ్మద్, అబ బకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ మేరకు కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని భారత భద్రతా సిబ్బంది వెల్లడించింది. ఈ క్రమంలో ఐసీస్ ఉగ్రవాద సంస్థ పోలీసులపై జరిపిన కాల్పులకు సంబంధించి వీడియోను విడుదల చేసింది. ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు అంగీకరించింది. కాగా, శ్రీనగర్‌లోని పోలీస్ లైన్స్‌లో అహ్మద్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ఈద్ వేడుకల అనంతరం విధుల్లోకి చేరిన కొన్ని గంటలకే హత్యకు గురైనట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Hijab వివాదంపై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

Next Story