- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తాండూర్: బెల్లంపల్లి ఏరియాలో ఫిబ్రవరి నెలలో 3.20లక్షల టన్నుల లక్ష్యానికి గాను 3.08 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 96 శాతం సాధించినట్లు ఏరియా జీఎం సంజీవరెడ్డి తెలిపారు. గోలేటీలోని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఏరియా లోని కైరిగూడ ఓసీపీ లో 3 లక్షల టన్నులకు గాను 3.08 లక్షల టన్నులతో 103 శాతం, గోలేటి ఓసీపీలో 50 వేల టన్నులకు గాను 0.20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు.
గత ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 11 నెలల్లో కైరిగూడ ఓసీపీలో 29.75 లక్షల టన్నులకు గాను 19.90 లక్షల టన్నులతో 67 శాతం బొగ్గు ఉత్పత్తి, బెల్లంపల్లి ఓసీపీ-2 లో 50 వేల టన్నులకు గాను 66 వేల టన్నులతో 132 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందన్నారు. మెడికల్ బోర్డు కు 519 మంది కార్మికులు హాజరు కాగా, 268 మంది కార్మికులు మెడికల్ బోర్డు ద్వారా అన్ ఫిట్ అయ్యారని తెలిపారు. సర్వీసులో ఉండగా వివిధ కారణాల వల్ల 20 మంది కార్మికులు చనిపోయారని తెలిపారు.
కారుణ్య నియామకాల్లో భాగంగా 225 మంది కార్మికుల పిల్లలు వారసత్వం ద్వారా సింగరేణిలో ఉద్యోగం పొందారని పేర్కొన్నారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, కార్మిక వాడల అభివృద్ధి ధ్యేయంగా సింగరేణి యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందన్నారు. బెల్లంపల్లి ఏరియా వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం, అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సహకరించాలని జీఎం కోరారు. సమావేశంలో డీజీఎం (ఐఈడీ) యోహాన, డీజీఎం (పర్సనల్) రాజేంద్ర ప్రసాద్, పీఎం లక్ష్మణ్ రావు, డీవై పీఎం తిరుపతి పాల్గొన్నారు.






