- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>ఖరగ్‌పూర్ ఐఐటీలో దారుణం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ కొండలరావు(28) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో ప్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సోమవారం ఉదయం తోటి స్నేహితులు గది తలుపులు కొట్టిన ఎంతకీ తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తలుపులు తెరచి చూడగా విద్యార్థి చనిపోయి ఉన్నాడు. ఖరగ్‌పూర్ ఐఐటీ వర్గాలు ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు విజయనగరం ఎస్పీ అనుమతి తీసుకొని ఖరగ్‌పూర్‌కు […]</p>
ఖరగ్‌పూర్ ఐఐటీలో దారుణం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ కొండలరావు(28) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో ప్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సోమవారం ఉదయం తోటి స్నేహితులు గది తలుపులు కొట్టిన ఎంతకీ తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తలుపులు తెరచి చూడగా విద్యార్థి చనిపోయి ఉన్నాడు. ఖరగ్‌పూర్ ఐఐటీ వర్గాలు ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు విజయనగరం ఎస్పీ అనుమతి తీసుకొని ఖరగ్‌పూర్‌కు బయలుదేరారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
Tags: student, suicide, IIT, kharagpur, vijayanagaram
Next Story






