గిరిజనుల కోసం ఏజెన్సీలో ఎమ్మెల్యే

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-06-25 04:41:25  IST  )

<p>దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ జనజీవనాన్ని అతలాకుతలం చేసేసింది. నెలల పాటు ఉపాధి లేకుండా చేసింది. దీంతో పనులు లేవు, ఆదాయం లేదు, కనీసం తిండిగింజలు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో గిరిజనుల ఆకలి తీర్చేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏజెన్సీ ఏరియాలో సాహస యాత్ర చేపట్టారు. బుట్టాయగూడెం మండలంలోని దట్టమైన అడవుల్లోని మోతుగూడెంలోని 150 కుటుంబాలు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న [&hellip;]</p>

గిరిజనుల కోసం ఏజెన్సీలో ఎమ్మెల్యే
X

దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ జనజీవనాన్ని అతలాకుతలం చేసేసింది. నెలల పాటు ఉపాధి లేకుండా చేసింది. దీంతో పనులు లేవు, ఆదాయం లేదు, కనీసం తిండిగింజలు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో గిరిజనుల ఆకలి తీర్చేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏజెన్సీ ఏరియాలో సాహస యాత్ర చేపట్టారు.

బుట్టాయగూడెం మండలంలోని దట్టమైన అడవుల్లోని మోతుగూడెంలోని 150 కుటుంబాలు కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే… 75 లక్షల రూపాయల విలువైన నిత్యవసర సామగ్రి అధికారులతో కలిసి మోసుకుంటూ వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటుకుంటూ భోజనం వేళ దాటే సమయానికి మోతుగూడెం చేరుకున్నారు. గ్రామంలోని మొత్తం 150 కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలరాజు తదితరులకు గ్రామానికి చెందిన గిరిజన మహిళ గోగుల కమలమ్మ ఇంట్లో ఉన్న గొడ్డుకారంతో పెట్టిన భోజనం చేసి, ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రహదారులు లేవని చెప్పడంతో.. తాను కూడా కొంత మేర టూవీలర్‌పై ఇంకొంత దూరం నడిచి వచ్చానని అన్నారు.

Next Story