ఐదో పెళ్లికి రెడీ అయిన నటి భర్త.. విడాకులకు డిమాండ్

by  |
ఐదో పెళ్లికి రెడీ అయిన నటి భర్త.. విడాకులకు డిమాండ్
X

దిశ, సినిమా : మలయాళం టెలివిజన్ సెలబ్రిటీలు అంబిలి దేవి, ఆదిత్యన్ జయన్ మ్యారేజ్ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. 2019లో జరిగిన ఈ వివాహం ఆదిత్యన్‌కు నాలుగోది కాగా, అంబిలికి రెండో పెళ్లి. అప్పట్లో తన కుటుంబాన్ని నాశనం చేశాడంటూ ఆదిత్యన్‌పై అంబిలి భర్త, కెమెరామెన్ ఎస్.లొవెల్ ఫైర్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే రెండేళ్లకే అంబిలి, ఆదిత్యన్‌ విడిపోయారని, విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తుండగా.. దీనిపై క్లారిటీ ఇచ్చింది నటి.

ఇప్పటికీ తాను ఆదిత్యన్ భార్యగానే బతుకుతున్నానని తెలిపింది. చాలా కష్టాలు ఎదుర్కొని ఆదిత్యన్‌ను పెళ్లి చేసుకున్న తాను.. ప్రెగ్నెంట్ అయ్యే వరకు( గతేదాడి ఏప్రిల్) హ్యాపీ లైఫ్ లీడ్ చేశానని తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 ఏళ్ల కొడుకుతో కలిసి అద్దె ఇంట్లోనే ఉంటున్నానని చెప్పింది. డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చానని, ఆ టైంలో మ్యారేజ్ లైఫ్‌లో అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. ఆదిత్యన్ మరో అమ్మాయితో రిలేషన్‌లోకి వెళ్లిపోయాడని వెల్లడించింది. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఈ విషయం చెప్పారని, కానీ తన భర్తపై చాలా నమ్మకంతో ఉన్నానని తెలిపింది. ఈ మధ్య కొంత మంది కాల్ చేసి ‘కంగ్రాట్స్.. నువ్వు మళ్లీ ప్రెగ్నెంట్ అంటా కదా’ అని చెప్పడంతో రియలైజ్ అయ్యానని చెప్పింది. ఆదిత్య ఫేస్ బుక్ కవర్ పేజీపై తన ఫొటో ఉండటంతో వారు కాల్ చేశారని అర్ధమైందని తెలిపింది.



Next Story