- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telangana Assembly Election 2023 > ఎన్నికల వేళ తీవ్ర విషాదం.. హార్ట్ ఎటాక్‌తో పోలింగ్ సిబ్బంది మృతి
ఎన్నికల వేళ తీవ్ర విషాదం.. హార్ట్ ఎటాక్‌తో పోలింగ్ సిబ్బంది మృతి
తెలంగాణ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఓ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఓ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. కొండాపూర్ వెటర్నటీ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుధాకర్ (48) అనే ఉద్యోగికి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 248లో పోలింగ్ విధులు కేటాయించారు.
ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున పోలింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా సృహతప్పి పడిపోయారు. వెంటనే సుధాకర్‌ను పటాన్ చెరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలింగ్ విధులకు వచ్చిన సహచర ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడంతో మిగతా సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.
Next Story






