అతీగతీ లేకుండా పోయిన ప్రభుత్వ పథకం.. తొమ్మిదేండ్లలో ఇచ్చింది మూడుసార్లే!

by GSrikanth |

వెనుకబడిన కులాల యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు స్టేట్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ అతీగతీ లేకుండా పోయింది.

అతీగతీ లేకుండా పోయిన ప్రభుత్వ పథకం.. తొమ్మిదేండ్లలో ఇచ్చింది మూడుసార్లే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వెనుకబడిన కులాల యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు స్టేట్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ అతీగతీ లేకుండా పోయింది. తొమ్మిదేండ్లలో కేవలం మూడు సంవత్సరాలకు మాత్రమే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మిగిలిన ఆరేండ్లలో ఫండ్స్ రిలీజ్ ప్రాసెస్‌ను నిలిపేసింది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల్లో పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ స్కీమ్‌ను ప్రవేశ పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఫస్ట్ టర్ములో మాత్రమే అమలు చేసి రెండోసారి పవర్‌లోకి వచ్చిన తర్వాత మర్చిపోయింది. ఈ యేడు ఎన్నికలు వస్తుండడంతో చేతివృత్తులకు చేయూత పేరుతో రూ.లక్ష సాయం ఇచ్చేలా కొత్త స్కీమ్‌ అమల్లోకి తీసుకొచ్చారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో దీనిని లాంఛనంగా ప్రారంభించినా ఇప్పటికీ అతీగతి లేదు.

అలంకారప్రాయంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్

బీసీలకు స్వయం ఉపాధి సాయం కల్పించాలనే లక్ష్యంతో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా అది అలంకారప్రాయంగానే ఉన్నది. దీని ద్వారా స్టేట్ వైడ్‌గా కేవలం 40 వేల మందికి మాత్రమే సాయం అందించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్కరికీ సాయం అందలేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేవలం రూ.231.66 కోట్లు మాత్రమే ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. 2015-16లో ప్రభుత్వం నుంచి సాయం అందుకోడానికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా 28 మంది ఎదురు చూస్తూనే ఉన్నారు. వీరికి రూ.28.45 లక్షల మేర ఆర్థిక సాయం అందించేలా కార్పొరేషన్ లెక్కలు వేసుకున్నది.

బీసీ కులాలకు ఫెడరేషన్ల ఏర్పాటు

వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కులానికో బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా సాయం అంతంత మాత్రంగానే అందుతున్నది. పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఈ కార్పొరేషన్లలో చైర్మన్‌లుగా, సభ్యులుగా నియమించి పదవులతో సరి పెట్టింది. కానీ వీటి ద్వారా ఆయా కులాలకు అందిన సాయంపై బీసీ పేదల్లోనే తీవ్ర అసంతృప్తి ఉన్నది. బీసీల్లో అత్యంత వెనుకబడిన ప్రజల అభివృద్ధి కోసం ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మొదటి సారి చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్‌ను నియమించింది. దీనికి రూ.1,000 కోట్లు కేటాయించనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నది. ఆ కార్పొరేషన్ టర్ము ముగిసినా నేటి వరకూ కొత్తగా చైర్మన్‌‌ను నియమించలేదు. బడ్జెట్ నుంచి ఫండ్స్ రిలీజ్ కూడా ఆగి పోయాయి.

పురోగతి లేని ఆత్మగౌరవ భవన్‌లు

బీసీ కులాలకు ఆత్మగౌరవ భవన్‌ల పేరుతో ప్రభుత్వం ఉచితంగా స్థలం, నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ వేర్వేరు జీవోలు జారీ చేసింది. ఏండ్లు గడుస్తున్నా నేటికీ వాటి నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. అగ్ర కులాలకు ఖరీదైన ప్రాంతాల్లో భూములు కేటాయించిన ప్రభుత్వం బీసీ కులాలకు మంజూరు చేసిన ఆత్మగౌరవ భవన్‌లకు మాత్రం నగరానికి దూరంగా కేటాయించిందనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు కొన్ని కులాలకు ఇప్పటికే భవన్‌ల నిర్మాణం పూర్తయ్యి ప్రారంభోత్సవాలు జరిగినా బీసీ ఆత్మగౌరవ భవన్‌లు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నదనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది.

బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద రిలీజ్ అయిన ఫండ్స్ (రూ.లక్షల్లో), లబ్ధిదారుల వివరాలు :



Next Story