- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ 13 రోజులు కీలకం.. అలర్ట్‌గా ఉండాలి: సైబరాబాద్సీపీ
అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 30న జరుగనున్న నేపథ్యంలో ఈ 13 రోజులు అత్యంత కీలకమని సైబరాబాద్కమిషనర్ స్టీఫెన్రవీంద్ర అన్నారు.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 30న జరుగనున్న నేపథ్యంలో ఈ 13 రోజులు అత్యంత కీలకమని సైబరాబాద్కమిషనర్ స్టీఫెన్రవీంద్ర అన్నారు. విధుల నిర్వర్తనలో చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా చూపించవద్దని సూచించారు. కమిషనరేట్కార్యాలయంలో శుక్రవారం కమిషనర్స్టీఫెన్రవీంద్ర అన్ని జోన్ల డీసీపీలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూచనలు ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమలు చేస్తున్న చర్యల గురించి తెలుసుకున్నారు. చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చూడాలని చెప్పారు. దీని కోసం తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని చెప్పారు. అనుమానాస్పదంగా కనిపించే వారిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా విచారించాలన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌లు జరపటం ద్వారా ఓటర్లలో విశ్వాసాన్ని కలిగించాలని చెప్పారు. మద్యం, నగదు పంపిణీని అడ్డుకోవాలన్నారు. అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టటానికి పంచే గిఫ్టులపై కూడా దృష్టి పెట్టాలన్నారు. రౌడీషీటర్లు, సమస్యలు సృష్టించగలరనుకున్న వారిపై పటిష్టమైన నిఘా ఉంచాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పక్షపాత రహితంగా విధులు నిర్వర్తించాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో 5 నుంచి 7 నిమిషాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి 2 నిమిషాల్లో స్పందించాలన్నారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, శంషాబాద్ డీసీపీ నారాయణ్రెడ్డితోపాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.






