తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల.. 55 మందితో జాబితా

by Disha Web Desk 2 |
తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల.. 55 మందితో జాబితా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఈ మేరకు మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేయాల్సి ఉండగా.. ఉదయం 9:05 గంటలకు విడుదల చేశారు. మొత్తం 55 మంది అభ్యర్థుల జాబితాతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. వివాదం లేని స్థానాలను తొలుత ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో మిగిలిన స్థానాల అభ్యర్థులను సైతం ఖరారు చేయనున్నది. ఫస్ట్ లిస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ఉండగా.. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు.









Next Story

Most Viewed