హరీష్ రావు కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు

by GSrikanth |

ఎన్నికల వేళ తెలంగాణ పోలీసులు స్పీడ్ పెంచారు. ఓటర్లకు డబ్బు, మద్యం వంటివి రాజకీయ నాయకులు పంపిణీ చేయకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు.

హరీష్ రావు కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తెలంగాణ పోలీసులు స్పీడ్ పెంచారు. ఓటర్లకు డబ్బు, మద్యం వంటివి రాజకీయ నాయకులు పంపిణీ చేయకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు. సిద్దిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి హరీష్ రావు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

Next Story