- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ ప్రచార రథం.. ఫిదా అవుతోన్న నియోజకవర్గ ప్రజలు (వీడియో)
కొందరు ట్రెండ్‌ను ఫాలో అవుతారు. మరి కొందరు ట్రెండ్ సెట్ చేస్తారు. ఇలాంటి కోవకు చెందిన వారే నిర్మల్ జిల్లా బీజేపీ నేతలు.

దిశ, వెబ్‌డెస్క్ : కొందరు ట్రెండ్‌ను ఫాలో అవుతారు. మరి కొందరు ట్రెండ్ సెట్ చేస్తారు. ఇలాంటి కోవకు చెందిన వారే నిర్మల్ జిల్లా బీజేపీ నేతలు. అందరూ నడిచే దారిలో మేమెందుకు నడవాలి.. మేము ప్రత్యేకం అంటూ వినూత్నంగా ఆలోచించారు. లోకల్‌గా ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఔరా అనిపించే ఐడియాతో జనాన్ని ఆకర్షిస్తున్నారు. బీజేపీ ఖానాపూర్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ తరుఫున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే మిగతా అభ్యర్థులకు భిన్నంగా భారీగా ప్రచార రథాలు వాడకుండా సాంప్రదాయ వాహనాలైన బైల్ గాడి (ఎడ్ల బండి)తో ప్రచారం చేస్తున్నారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో ఆదివాసీ గ్రామాలు, తండాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యం కూడా లేదు. దీనికి ప్రచార రథాలకంటే బైల్ గాడినే సరైనదని ఆలోచించిన బీజేపీ నేతలు దానినే ప్రచార రథంగా మార్చుకోని వినూత్నంగా ప్రచారం చేపడుతున్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి, ఖానాపూర్ మండలాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రమేశ్ రాథోడ్ తరుఫున ప్రచారం చేపట్టి స్థానిక ప్రజలను ఆకర్షించారు.






