డబ్బు సంచులతో రాజకీయం చేస్తున్నారు.. ఎమ్మెల్సీ తాతా మధు సంచలన వ్యాఖ్యలు

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-31 09:42:19  IST  )

డబ్బు సంచులతో కొంతమంది రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతామధు అన్నారు.

డబ్బు సంచులతో రాజకీయం చేస్తున్నారు.. ఎమ్మెల్సీ తాతా మధు సంచలన వ్యాఖ్యలు
X

దిశ బ్యూరో, ఖమ్మం : డబ్బు సంచులతో కొంతమంది రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతామధు అన్నారు. మంగళవారం రేపటి కేసీఆర్ ఆశీర్వాద సభకు సంబంధించి కల్లూరు లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్శంగా తాతామధు మాట్లాడుతూ.. పెద్దమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా అభ్యర్థి ఎవరో తేల్చలేని పరిస్థితిలో ఉందన్నారు. గంటకో అభ్యర్థిని, అరగంటకో మాట మారుస్తున్నారన్నారు. కానీ సండ్ర అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైందని, ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం కూడా చేస్తున్నారన్నారు. వెంకటవీరయ్య నియోజకవర్గానికి 15 సంవత్సరాలుగా ఏం చేశారనేది నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఈ జిల్లాలో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ గెలవబోతున్నారని, సిక్సర్ కూడా కొడతారనే నమ్మకం ఉందన్నారు.

సత్తుపల్లే తన దేవాలయమని, నియోజకవర్గ ప్రజలే తన దేవుళ్లని భావించే వ్యక్తి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆయన పనితీరు అందరికీ తెలుసని, ప్రజల కోసం విశ్రమించకుండా, నిస్వార్థ సేవలు అందించే విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10మంది ఎమ్మెల్యేల్లో మొదటి వరుసలో సండ్ర ఉంటారన్నారు. సత్తుపల్లి ప్రజల ఆశీర్వాదాన్ని సండ్రకు అందించడానికి రేపు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభ జరుగుతుందని, ఈ సభలో కేసీఆర్ ఇప్పటి వరకు ఏం చేశామో, భవిష్యత్తు్లో సత్తుపల్లికి, రాష్ట్రానికి ఏం చేస్తారనే విషయాలు ప్రజలకు వివరిస్తారని చెప్పారు. ఈసభకు పెద్దఎత్తున సక్సెస్ చేయాలని కోరారు.

9న నామినేషన్ వేస్తున్నా..: సండ్ర వెంకటవీరయ్య

రేపు జరిగే బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు కృషి చేస్తు్న్నామని, ఈ సభలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. పార్కింగ్ ప్రదేశాన్ని సైతం దగ్గరలోనే ఏర్పాటు చేశామని, సభకు వచ్చే ప్రజల కోసం మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను సైతం సిద్ధం చేస్తున్నామన్నారు. ఇప్పటికే మొదటి విడత ప్రచారం పూర్తయిందని సండ్ర అన్నారు. 9వ తేదీన నామినేషన్ వేస్తున్నానని, పార్టీ నాయకత్వాన్ని అందరికీ ఆహ్వానం అందిందన్నారు. నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకత్వానికి పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కల్గించే విధంగా భారీ బహిరంగ సభ ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.

ఇప్పటికే ఎన్నికల మానిఫెస్టోకి సంబంధించి లక్ష కరపత్రాలు ముద్రించి ప్రజలకు చేర్చామన్నారు. కేసీఆర్ మేనిఫెస్టోకి నిబద్ధత ఉందని, కాంగ్రెస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదన్నారు. కేసీఆర్ బీమా పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఎవరిమీద అధికారం చెలాయించకుండా ప్రజలతో మమేకమై ఎలా ఉన్నామో స్వయంగా ప్రజలే చెబుతున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా భారీ మెజార్టీతో గెలుపు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, జెడ్పీటీసీ కట్ట అజయ్ బాబు, కల్లూరు ఎంపీపీ బీరవల్లి రఘు, తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు డాక్టర్ లక్కినేని రఘు, కల్లూరు సొసైటీ అధ్యక్షులు డీసీసీబీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, బీఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ , మండల బీఆర్ ఎస్ పార్టీ కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, మాజీ ఎంపీటీసీ సభ్యులు బాలు, కో అప్షన్​ సభ్యులు ఎండి.ఇస్మాయిల్ ,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్. కమ్లి, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు , మేకల కృష్ణ ,నందిగం ప్రసాదు, కట్టా అర్లప్ప ,కాటేపల్లి రజనీకాంత్, యూనోష్ పాస్టర్ , కీసర వెంకటేశ్వర్రెడ్డి ,బైరెడ్డి నరసింహారెడ్డి, అజ్మీర జమలయ్య ,రాము నాయక్, కంభంపాటి పుల్లాచారి, పసుపులేటి శ్రీనివాసరావు , ఏనుగుల అంజి ,సిహెచ్ కిరణ్, బొప్పన రామారావు, వివిధ సంఘాల పాస్టర్లు , మూర్తల పిచ్చిరెడ్డి ,మంచాల కృష్ణ,మండల బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story