- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి కేసీఆర్’
ఆధ్యాత్మికతలో భారతదేశం విరసిల్లుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉందన్నారు. అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య అమ్మవారిని సోమవారం దర్శించుకున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆధ్యాత్మికతలో భారతదేశం విరసిల్లుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉందన్నారు. అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య అమ్మవారిని సోమవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. కామాఖ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని, సీఎం కేసీఆర్‌ను మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. నాలుగైదు ఏళ్ల క్రితం అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. కామాఖ్య దేవిని పునర్ దర్శించుకునే భాగ్యం కలుగడం సంతోషంగా ఉందన్నారు.
Next Story






