- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండ్ల సింగారంలో ఉద్రిక్తత.. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో గుడిసెల తొలగింపు.. అడ్డుకున్న నివాసితుల అరెస్ట్
హనుమకొండ గుండ్ల సింగారంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: హనుమకొండ గుండ్ల సింగారంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం ఉదయం 5 గంటలకు హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సుమారు 200 మంది పోలీసుల బందోబస్తుతో హనుమకొండ గుండ్ల సింగారంలోని గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. దీంతో గుడిసె వాసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తమకు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని అడ్డుకుంటే లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారని గుడిసె వాసులు వాపోయారు. గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి జీవిస్తున్నామని తమను ఇప్పటికిప్పుడు బయటికి పొమ్మంటే ఎక్కడికి పోవాలని గుడిసె వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. గుడిసెల కూల్చివేతను నిరసిస్తూ నిరసన తెలిపిన సుమారు 30 మంది గుడిసె వాసులను పోలీసులు అరెస్టు చేసి కేయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.






