- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టన్నింగ్ చీర లుక్‌లో మెరిసిన జాన్వీ కపూర్.. ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్
చీరలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో కట్టిపడేస్తున్న జాన్వీ కపూర్.

దిశ, వెబ్ డెస్క్: సినిమాలతోనే కాదు, సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉండే స్టార్ బ్యూటీల్లో జాన్వీ కపూర్ ఒకరు. వరుసగా హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌ను జెట్ స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్తోంది.
ఇటీవల రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ, నటన పరంగా మిశ్రమ స్పందనలు అందుకున్నప్పటికీ తన గ్లామర్‌తో మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే జాన్వీ, తరచూ తనకు సంబంధించిన స్టైలిష్ మరియు గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దీంతో రోజురోజుకూ ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో జాన్వీ క్రీమ్ కలర్‌పై బ్లాక్ బార్డర్ కలిగిన అందమైన చీరను స్టైలిష్‌గా ధరించి మెరిసిపోయింది.
దానికి తగ్గట్టుగా డిజైనర్ బ్లౌజ్‌ను జతచేసి తన అందాలను మరింత హైలైట్ చేసింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్స్‌తో కెమెరాకు ఇచ్చిన పోజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే చీరకు మ్యాచ్ అయ్యే భారీ నెక్లెస్, అందమైన ఇయర్‌రింగ్స్‌తో తన లుక్‌కు మరింత ఎలిగెన్స్ జోడించింది.
నుదుటిపై చిన్న బొట్టు, కురులను స్టైలిష్‌గా ముడివేసుకున్న తీరు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. మొత్తంగా ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్ తన అందాలతో అభిమానులను ఫిదా చేయగా, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






