- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ వెంచర్లు.. అడ్డగోలు విక్రయాలు
మిర్యాలగూడ పట్టణంలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

మిర్యాలగూడ పట్టణంలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. భూములను చదును చేయడం.. హద్దు రాళ్లు పాతడం ప్లాట్లు విక్రయించడం.. ఇలా ప్రభుత్వ అనుమతులు లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేసి రియల్ దందా చేస్తున్నారు. ప్రభుత్వ భూములు కూడా కలిపి వెంచర్లు చేసి అమాయకులకు అంటగడుతున్నారు. సర్వే నంబర్ 622, 629 ,631,638 ల లో ఉన్న భూముల్లో హైదరాబాద్ కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డగోలుగా ప్లాట్ లు చేసి విక్రయిస్తున్నారు. అయితే వెంచెర్ చేసిన భూమిలో అ సంస్థకు చెందిన భూములుగా గుర్తింపు లేదని సమాచారం. పంట కాలువ సైతం ఆక్రమించి ప్లాట్లలో కలిపారని తెలిసింది. ప్రభుత్వ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ,మిర్యాలగూడ టౌన్: వ్యాపార కేంద్రంగా ఉన్న మిర్యాలగూడలో అక్రమ లే అవుట్‌లతో పాటు ఆక్రమణలు జరుగుతున్నాయి. లే అవుట్లలో కొంత వ్యవసాయ భూములను మాత్రమే నాలా గా మార్పు చేసి రియల్ దందా సాగిస్తున్నారు. మరోవైపు కోట్ల విలువైన భూములను ప్రభుత్వ భూములు ఆక్రమిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్రమణలు ,అక్రమాలు జరుగుతున్న అటు రెవెన్యూ అధికారులు,ఇటు మున్సిపాలిటీ అధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమ లే అవుట్‌తో ప్లాట్లు అమ్మకాలు..
మిర్యాలగూడ పట్టణం లోని అద్దంకి నార్కట్ పల్లి రహదారి పక్కన ఏర్పాటు చేసిన వెంచర్ లో ఆక్రమణలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ప్రభుత్వ నిషేధిత జాబితాలో పొందుపర్చిన భూమిని ఆక్రమించి తమ లే అవుట్ లో కలుపుకుని దందా కు తెరదీశారు. సర్వే నంబర్ 622, 629 ,631,638లలో ఉన్న భూముల లో హైదరాబాద్ కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డగోలుగా ప్లాట్ లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. అయితే వెంచెర్ చేసిన భూమిలో అ సంస్థకు చెందిన భూములుగా గుర్తింపు లేదని సమాచారం. అంతేకాకుండా వ్యవసాయ భూమిగా , కొంత భూమి నాలా గా ఉన్నది. మున్సిపాలిటీ అనుమతులు తీసుకోకుండా వెంచర్ చేయడం పట్ల ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో కూడా పెద్ద ఎత్తున ఓ కౌన్సిలర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 628లో నిషేధిత భూమి ఉన్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూ భారతిలో నమోదు చేసినట్లు చూపుతుంది.
కాల్వ భూములు పూడ్చి..
సర్వే నెంబర్ 628 లో ఉన్న కాలువ భూములు ఆక్రమించి వెంచర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వెంచర్ చేసిన భూములలో సాగు భూములకు నీరందించేందుకు సర్వే నెంబర్ 628 లో 0.0050, 0.0025, 0.0050, 0.0075, 0.325, 0.0075, 0.0075, 0.0025, 0.0025, సర్వేనెంబర్ 631 లో 0.0175, 0.0475, 0.0150 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ భూమిగా భూ భారతిలో నమోదు అయింది. అలాంటి భూమిలో ఉన్న కాలువను పూర్తిగా పూడ్చి ఆక్రమించారు. దీనివల్ల కింద ఉన్న భూములకు నీరందే పరిస్థితి లేకుండా అయిందని రైతులు వాపోతున్నారు. ఈ ఆక్రమిత కాల్వల విలువ సుమారు లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం తెలియదు:టిపిఓ శశికుమార్, మిర్యాలగూడ
మిర్యాలగూడలో అక్రమ వెంచర్లు ,అనుమతులు లేని వాటి విషయమై సమాచారం లేదు. రెండు రోజుల క్రితం బదిలీపై వచ్చాను. ఆక్రమణ ,అనుమతులు లేకుండా వెంచర్లు ఉంటే చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ టీపీఓ శశి కుమార్ అన్నారు.






