నేను నా త్యాగాలకు ప్రతిఫలం అందుకునే దశలో ఉన్నాను.. వారే నాకు స్ఫూర్తినిస్తారంటూ ప్రియాంక కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-20 06:18:42  IST  )

తాను హాలీవుడ్ టాప్ స్టార్ ఏంజెలీనా జోలీతో కలిసి పని చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

నేను నా త్యాగాలకు ప్రతిఫలం అందుకునే దశలో ఉన్నాను.. వారే నాకు స్ఫూర్తినిస్తారంటూ ప్రియాంక కామెంట్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ స్పెషల్ క్రేజ్ రాబట్టుకున్నారు. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. ఇండియన్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి హాలీవుడ్‌లో స్థిరపడ్డారు. చాలా కాలం తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ పాన్-ఇండియా యాక్షన్-అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’ ద్వారా ఇండియన్ సినిమాల్లోకి గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్నారు ప్రియాంక చోప్రా. అయితే, భారతీయ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హాలీవుడ్ ప్రాజెక్టులను ఆమె అస్సలు తగ్గించడం లేదు. భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ కెరీర్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చారు. తాను హాలీవుడ్ టాప్ స్టార్ ఏంజెలీనా జోలీతో కలిసి పని చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏంజెలీనా జోలీతో పాటు పెనెలోప్ క్రజ్, సల్మా హాయెక్ లాంటి నటీమణులు తనకు ఎంతో స్ఫూర్తినిస్తారని ప్రియాంక తెలిపారు.

అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించడానికి ఆమె నిరాకరించారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ఒక సినిమా కోసమా, యాడ్ క్యాంపెయిన్ కోసమా లేక ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసమా అనేది సస్పెన్స్‌గా మారింది. అలాగే రాజమౌళి ‘వారణాసి’ చిత్రం గురించి మాట్లాడుతూ.. "మేము చాలా ప్రతిష్టాత్మకంగా, గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. గత మూడేళ్లుగా మేము పడుతున్న కష్టాన్ని ప్రపంచానికి చూపించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు. ప్రస్తుతం తన కెరీర్ గురించి చెప్తూ.. "మొదట్లో నాకోసం కథలు రాసేవారు కాదు. కానీ ఇప్పుడు నా భర్త నిక్ జోనాస్ అన్నట్లు.. నేను నా త్యాగాలకు ప్రతీఫలం అందుకునే దశలో ఉన్నాను. ఇప్పుడు నాకు నచ్చిన ప్రాజెక్ట్‌లను నేనే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నాకుంది" అని ప్రియాంక సంతోషం వ్యక్తం చేశారు.

Next Story