- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంభమేళా మోనాలిసాకు భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు
కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసాకు రక్షణ కల్పించాలని కేరళం హైకోర్టు ఆదేశించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్‍లో వైరల్‍గా మారిన మోనాలిసా భోస్లే (Kumbh Mela Monalisa) భద్రత విషయంలో కేరళం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మోనాలిసాకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఈ ఏడాది మార్చిలో కేరళంలో మతాంతర వివాహం చేసుకుంది. అయితే మోనాలిసా మైనర్ అని, ఆమెను అపహరించుకుని వెళ్లి వివాహం చేసుకున్నారంటూ ఫర్మాన్ మీద ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్‌లో పోలీసులు కిడ్నాప్, పోక్సో కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని ఫర్మాన్, ఆయన భార్య మోనాలిసా కేరళం హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్ వేశారు. పెళ్లి కారణంగా మధ్యప్రదేశ్‌లో ఉంటే తమకు ప్రాణహాని ఉందని మోనాలిసా దంపతులు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఆమె ప్రాణాలకు తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది.
మోనాలిసా వయసుపై వివాదం:
ఈ కేసులో మోనాలిసా మైనర్ అంటూ ఆమె తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే కేరళ హైకోర్టులోని మరో బెంచ్ గతంలో ఈ అంశంపై స్పందిస్తూ ప్రాథమిక ఆధారాల ప్రకారం యువతి మేజర్ లాగే కనిపిస్తోందని పేర్కొంది. ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆమెను మేజర్‌గానే భావించవచ్చని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. బర్త్ సర్టిఫికెట్, ఓటరు కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ల ద్వారా.. యువతి పుట్టినతేదీ 2008 జనవరి 1 అని తెలుస్తోందని, తద్వారా ఆమెను మేజర్‌గానే భావించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.






