- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహేతర సంబంధాల్లో ఈ రాష్ట్రమే టాప్.. రోజురోజుకూ పెరుగుతోన్న క్రేజ్
దేవాలయాలకు, పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కాంచీపురం నగరంలో వివాహేత సంబంధాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో : దేవాలయాలకు, పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కాంచీపురం నగరంలో వివాహేత సంబంధాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. వివాహేతర సంబంధాలు, రహస్య సంబంధాలు కోరుకునే వ్యక్తుల కోసమే ఉద్దేశించిన యాష్లే మాడిసన్ అనే డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లో సైన్ అప్‌ల పరంగా ఆ నగరం మరోసారి దేశంలో అగ్రగామి నగరంగా అవతరించింది. ఆ యాప్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. కాంచీపురం నగరం అధిక సైన్ అప్‌లు చేసుకొని వరుసగా 2వ సారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గత వేసవిలో కూడా వివాహేతర సంబంధాలపై ఆసక్తి ఉన్న అగ్ర ప్రాంతంగా ఇది గుర్తింపు పొందింది. దీంతో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన నగరం ఈ విషయంలోనూ ఇప్పుడు మొదటి స్థానంలో నిలిచి దేశ వ్యాప్తంగా చర్చలోకి వచ్చింది.
3 వ స్థానానికి ఎగబాకిన దేశం
ఈ ఏడాది కాంచీపురం తర్వాత కోయంబత్తూర్, తిరువళ్లూరు, చెన్నైలు ఈ యాప్‌ను ఎక్కువగా వాడుతున్నాయి. అయితే ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే మన దేశం ఈ యాప్ వాడకంలో ఈ ఏడాది మరింత ముందుకు ఎగబాకింది. ఈ యాప్ మెంబర్‌షిప్ సైన్ అప్‌లలో 20 దేశాలలో భారత్ 8వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరింది. భారతదేశంలో రహస్య డేటింగ్‌పై ఆసక్తి పెరుగుతుందని ఈ డేటా తెలియజేస్తోంది. ఏ ఏడాది మొదట్లో కూడా ఇదే ఉద్దేశం కోసం వచ్చిన ‘గ్లీడెన్’ అనే డేటింగ్ ప్లాట్‌ఫామ్‌కు సైతం భారత్‌లో 40 లక్షల మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. ఈ సంఖ్యలు వివాహం, సంబంధాలపై భారత్‌లో వైఖరి మారుతోందని స్పష్టంగా చెబుతున్నాయి.
టైర్ 2 నగరాల్లోనూ..
ఈ ధోరణి కేవలం మెట్రో సిటీలకే పరిమితం కాకుండా టైర్ 2 సిటిల్లోనూ ఎక్కువవుతోంది. ఈ సిటిల్లో ప్రజల ఆలోచనా విధానాలు, జీవనశైలి వేగంగా మారడానికి, ఇలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మరలడానికి పలు కారణాలు ఉన్నాయి. చౌకైన డేటా ప్లాన్లు, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల వల్ల చిన్న నగరాల్లోని ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. చిన్న నగరాల్లో భౌతికంగా ఎవరినైనా కలవాలంటే సమాజానికి, బంధువులకు తెలిసిపోతుందనే భయం ఉంటుంది. అయితే యాష్లే మ్యాడిసన్ వంటి యాప్‌లు గుర్తింపును రహస్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడంతో, ప్రజలు తమ వ్యక్తిగత కోరికలను సామాజిక భయం లేకుండా పంచుకోవడానికి వీటిని సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు. అలాగే ఈ యాప్ డేటింగ్ కోసం అని చెప్పకుండా వివాహేతర సంబంధం కోసమే ఉద్దేశించి రూపొందించింది కావడంతో వాటిని నేరుగా డౌన్ లోడ్ చేసుకొని వాడేస్తున్నారు. బలవంతపు పెళ్లిళ్లు, పని ఒత్తిడి, దాంపత్య జీవితంలో కమ్యూనికేషన్ గ్యాప్‌కు దారితీసి, బయట ప్రత్యామ్నాయ బంధాలను వెతుక్కునేలా చేస్తోంది. కొందరు మానసిక, శారీరక తృప్తి కోసం ఇలాంటి డిజిటల్ ప్రపంచాన్ని ఆశ్రయిస్తున్నారు.
చట్టపరంగానూ లేని అడ్డంకులు
భారతదేశంలో 2018లో సుప్రీంకోర్టు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 497ను రద్దు చేసి వివాహేతర సంబంధం నేరం కాదని ప్రకటించింది. ఈ చట్టపరమైన మార్పు జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది. చట్టపరమైన వాతావరణం వివాహేతర సంబంధాలను ప్రోత్సహించనప్పటికీ, వాటిని ఇకపై నేరంగా పరిగణించకపోవడం వల్ల ఈ ప్లాట్‌ఫామ్‌లను స్వీకరించడానికి ఉన్న ఒక అడ్డంకి తొలగిపోయింది.






